Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 7:45 pm Posted by : ramakrishna

చెవి వినికిడి ఆపరేషన్ కు ఏడున్నర లక్షల ఎల్వోసీ

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన బేబి ఆయన్షీ చెవి వినికిడి సమస్యతో భాధ పడుతూ నిమ్స్ లో చేరగా బాధితురాలికి బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రూ. 7,50,000 ల ఎల్వోసీని ఇప్పించారు.చెవి వినికిడి అపరేషన్ కు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని, అందుకు సహకరించాలని సునీల్ కుమార్ ను భాధితురాలి తరపునస్థానిక కాంగ్రెస్ నాయకులు కోరగా, వారి విన్నపం మేరకు సునీల్ కుమార్ సీ. ఎం రిలీఫ్ ఫండ్ నుండి ఏడున్నర లక్షల ఎల్వోసీ ని ఇప్పించారు. ఆపదలో ఆదుకొన్నందుకు సునీల్ కుమార్ కు భాధిత కుటుంబికులు కృతజ్ఞతలు తెలిపారు.