నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వర్సిటీ లోని స్థానిక కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసి ప్రొ. టి.యాదగిరి రావు,రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి రావు, ప్రిన్సిపల్ ప్రొ.ఆరతి ఇతర ఆచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ గొప్పతనాన్ని కార్యక్రమ అతిథులు విద్యార్థులకు వివరించారు.బంజారాల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు.సంప్రదాయాలు అటు బంజారాల సంప్రదాయ వస్త్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు,ఆచార్యులు తిలకించగా వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథ్, నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డా. బిలోజి నాయక్,డా.రమేష్ నాయక్,కిరణ్ రాథోడ్,ప్రవీణ్,రాజు నాయక్, బికోజి, నరేష్,గిరిజన శక్తి యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్, ఎన్ఎస్యూఐ వర్సిటీ అధ్యక్షుడు సాగర్ నాయక్,మోహన్,చందర్ రాథోడ్, లక్ష్మణ్, జాదవ్ పృథ్వీ, వర్సిటీ బోధన,బోధనేతర సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.