పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ను సన్మానించిన సేవాదళ్

   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సిహెచ్ రాం భూపాల్ ను జిల్లా కాంగ్రెస్  సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  గురువారం ఉదయం కార్యాలయం వద్ద  రాం భూపాల్ ను జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి జాయింట్ సెక్రటరీ శీలమంతుల రాజు, దిలీప్, అప్సర్, కొత్తపేట  మండల ప్రెసిడెంట్ మధు, సతీష్ లు శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.