Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 5:48 pm Posted by : ramakrishna

అత్యాధునిక పరికరాలతో క్లినిక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం

చానుస్ స్కిన్, హెయిర్, లేజర్ క్లినిక్ ను  ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :హైదరాబాద్ నగరాలకు దీటుగా నిజామాబాదులో స్కిన్ అండ్ హెయిర్, లేజర్ క్లినిక్ ను ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం నగరంలోని ఖలీల్ వాడి లో గల పాత శీతల్ స్కానింగ్ సెంటర్ భవనంలో యాజమాన్యం నర్సింగ్, డాక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చానుస్ స్కిన్ అండ్ హెయిర్, లేజర్ క్లినిక్ ను రిబ్బన్ కట్, జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
మాట్లాడుతూ.. స్కిన్ , హెయిర్ సమస్యల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి చికిత్స పొందే అవసరం లేకుండా, హైదరాబాద్ కు దీటుగా మన నిజామాబాద్ నగరంలో క్లినిక్ ను ఏర్పాటు చేసి సేవలందించడం సంతోషకరమని కొనియాడారు. జిల్లా ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, అతి తక్కువ ప్యాకేజీ తో లేజర్ ట్రీట్మెంట్స్ అందిస్తామని నిర్వాహకులు తెలపడం శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం నర్సింగ్, డాక్టర్ రాజేశ్ మాట్లాడుతూ.. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో అత్యాధునిక మైన పరికరాలతో, నిష్ణాతులైన వైద్యులచే చికిత్స ను అందించనున్నామన్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ, లేజర్ హెయిర్ రిడక్షన్, గ్రోత్ ఫ్యాక్టర్ కంట్రీట్ కాన్సెంట్రేట్, మీసో తెరఫీ, కార్ టైల్స్, ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా, రెడ్ లైట్ తెరఫీ, మైక్రో నీడ్లింగ్ తెరఫీ, కెమికల్ ఫీలింగ్, ఆధునిక లేజర్ చికిత్సలు అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్, డాక్టర్ శ్రీ శైలం, డాక్టర్ శ్రీనివాస్, అజయ్,
ల్యాబ్ టెక్నీషియన్ రాజ్ కుమార్, శశాంక్, దీపిక, యాజమాన్యం వారి కుటుంబ సభ్యులు, క్లినిక్ సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.

Setting up a clinic with modern equipment is commendable