రోడ్డు ప్రమాదంలో శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ మృతి

మోర్తాడ్, బతుకమ్మ :  శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ (55)  గురువారం ఉదయం జాతీయ రహదారి దొంకల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజేశ్వర్ రెడ్డి స్వగ్రామం  మోర్తాడ్ మండలం దొంకల్. గుర్తు తెలియని వాహనమా, మరెదైన వాహనం ఢీకొందా అనే విషయం తెలియాల్సి  ఉంది . రాజేశ్వర్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.