రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు చెల్లవు   హైదరాబాద్, బతుకమ్మ:  సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు చట్టాల స్ఫూర్తితోనే పోలీసులు పని చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అప్రజాస్వామిక పద్ధతులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా...