Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 4:55 pm Posted by : ramakrishna

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

మెండోరా, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మక్కలను కొనటానికి మెండోరా  గ్రామంలో ఇప్పటికైన మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని స్థానిక రైతులు మంగళవారం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. మా మండలంలో ఒక్క మక్కల గింజను కొన్న నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో తొందరగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులను ఆదుకోవాలని రైతులు స్థానిక తహసీల్దార్ కు తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.