Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 1:47 pm Posted by : ramakrishna

సెట్ – 2025కి పకడ్బందీ బందోబస్తు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సెట్ – 2025 పరీక్షాకేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య మంగళవారం తెలిపారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 10వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. అండర్ సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడొద్దని, నిషేధిత వస్తువులతో సెంటర్ల వద్ద తిరుగొద్దని సీపీ సూచించారు. సెంటర్ ల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను 10వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశించారు.