Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 6:00 pm Posted by : ramakrishna

విద్యుత్ వినియోగదారుల సేవయే ఉద్యోగుల పరమావధి

  • సీజీఆర్ఎఫ్ 2 చైర్మన్ ఎరుకల నారాయణ

 

భీమ్ గల్, బతుకమ్మ : విద్యుత్ వినియోగధారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సేవయే పరమావదిగా విద్యుత్ ఉద్యోగులు పని చెయ్యాలని వినియోగధారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీ.జీ. ఆర్. ఎఫ్. 2) చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో భీమ్ గల్ సబ్ డివిజన్ పరిధి విద్యుత్ వినియోగధారుల ఫిర్యాదుల పరిష్కారా వేదిక కార్యక్రమంను నిర్వహించారు. సీ. జీ. ఆర్. ఎఫ్. 2 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేదికనుద్దేశించి మాట్లాడారు. వినియోగధారులు ఎలాంటి సమస్యలున్న స్థానిక విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వినియోగధారులు ఫిర్యాదు ఇచ్చిన వెను వెంటనే సమస్య పరిష్కారానికి స్థానిక విద్యుత్ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. సంస్థకు వినియోగధారులే దేవుళ్ళని, వారిచ్చిన ఫిర్యాధులకు మనం వెంటనే స్పందించాలని విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే ఆ ఫిర్యాదు ఇచ్చిన స్థానిక అధికారులు స్పందించని పక్షంలో ఫిర్యాదును తెల్ల కాగితం పై వ్రాతపూర్వకంగా వ్రాసి, సర్వీస్ నెంబరును, వినియోగధారును ఆడ్రస్ వివరాలను వ్రాసి టోల్ ఫ్రీ నెంబర్ 1912 వాట్సాప్ కు పంపాలని ఆయన వినియోగధారులకు సూచించారు. ఫిర్యాదు కోసం రుసుము చెల్లించానవసరం లేదని, దీనికి వకిల్ ను పెట్టె అవసరం లేదని, ఫిర్యాదుదారుల వద్దకే ఫోరమ్ సభ్యులు వచ్చి సమస్యను గురించి తెలుసుకుంటారని ఆయన తెలిపారు. ఈ వేదికకు నాలుగు ఫిర్యాదు రాగ ఆ ఫిర్యాదులను పరిష్కరించి స్థానిక అధికారులకు వినియోగధారుల ముందే మాట్లాడి సమస్యలను వారం లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కంజుమర్ సర్వీస్ టెక్నికల్ మెంబెర్ రామకృష్ణ, మెంబర్ అఫ్ ఫైనాన్స్ కిషన్, ఆర్మూర్ డీఈఈ రాజేశ్వర్, భీమ్ గల్ ఏడీఈ వినోద్, ఏఈ లు సత్య ప్రసాద్, గవస్కర్, విద్యుత్ సిబ్బంది, వినియోగధారులు తదితరులు పాల్గొన్నారు.

Serving electricity consumers is the ultimate duty of employees