Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 7:22 pm Posted by : ramakrishna

సేవే మా పరమావధి

  • లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ చాకులింగం

 

బాల్కొండ, బతుకమ్మ: లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో మంగళవారం ముప్కాల్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో, కిసాన్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులకు ఉపయుక్తమయ్యే శంకర నారాయణ డిక్షనరీస్ (నిఘంటువులు) గ్రంథాల్ని లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ లయన్ చాకు లింగం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాజసేవ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ లాభాపేక్ష లేనిది. రాజకీయ మతాతీతమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల కంటే ఎక్కువ దేశాలలో ఉన్న అనేక క్లబ్బుల ద్వారా స్వచ్ఛంద సేవలను అందిస్తుంది. లయన్స్ క్లబ్ సభ్యులు తమ స్థానిక సమాజాలలో స్వచ్ఛంద సేవ చేయడంలో చురుకుగా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలకు సహాయం చేయడానికి మానవతా అవసరాలను తీర్చడానికి విశేష కృషి చేస్తారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ రంగాల్లో కార్యక్రమాల్ని చేస్తారు. కళ్ళు కనబడని వారికి సహాయం చేయడం, పర్యావరణాన్ని కాపాడడం వంటి ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. సేవే మా పరమావధి అని చాకులింగం అన్నారు. ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన భీంగల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సుప్రసిద్ధ వ్యాఖ్యాత కంకణాల రాజేశ్వర్ ను నల్ల చంద్రవ్వ నారాయణరెడ్డి స్మారకంగా నిర్మించిన లయన్స్ క్లబ్ ఆఫ్ కిసాన్ నగర్ లో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ లయన్ నల్ల జ్ఞాన సాగర్ రెడ్డి, లయన్ క్లబ్ ఆఫ్ బాల్కొండ చైర్మన్ దినేష్ పటేల్, నిజామాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ చాకు లింగం, కంటి సహాయ వైద్య నిపుణులు డాక్టర్ బ్యాగరి పుణ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.