జుక్కల్ ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

  జుక్కల్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సేవా, పర్యావరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు....