Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 4:58 pm Posted by : ramakrishna

అధికారి తీరుకు నిరసనగా సెర్ప్ ఉద్యోగుల చలో హైదరాబాద్

 . . రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సి ఆర్ డి రిటైర్డ్ అధికారి

. . .  చర్య తీసుకోవాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ డిమాండ్,

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి :   

సెర్ప్ ఉద్యోగులకు రెండున్నర దశాబ్దాలుగా హక్కుగా అందుతున్న ప్రయోజనాలను గత ఆరు నెలలుగా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న సీఆర్డీ లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారి సుబ్బారావు తీరుకు నిరసనగా బుధవారం సర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్, ఏపూరి నరసయ్య, సుదర్శన్ , జానయ్య, మహేష్ లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల కోసం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గా ఉంటూ 12మార్చ్ 2024 రోజున ఐఆర్ 5% వర్తింప చేస్తూ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ సీతక్కలు స్వయంగా సంతకం చేసి ఆర్డర్ రిలీజ్ చేసినప్పటికీ సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా లేనిపోని అడ్డంకులు సృష్టించి ఆరు నెలల కాలయాపన చేశారని ఆరోపించారు.ఈ విషయంలో మంత్రి డాక్టర్ సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఆర్ ఆర్ డి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్య మేడం లకు ఫిర్యాదు చేయగా వీరు సహకరించడంతో ఆరు నెలల ఆలస్యం తర్వాత ఈ నెలలో క్రెడిట్ కావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో మంజూరు చేసిన అలవెన్స్ లకు సంబంధించిన ఏరియార్స్ రావాల్సి ఉన్నప్పటికీ సదరు అధికారి ఇంతవరకు రాకుండా అడ్డుకున్నారన్నారు.ఐ ఆర్ ఏరియార్స్ 10 నెలలు రావాల్సి ఉండగా జనరేట్ కాకుండా సదరు అధికారి అడ్డుకున్నారని, ప్రతి నెల సాలరీస్ ఒకటవ తేదీన ఇవ్వాలని ఒకపక్క మా సీఈవో దివ్య, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కృషి చేస్తున్నప్పటికీ లేనిపోని అడ్డంకులు సృష్టిస్తూ ప్రతినెల రెండవ వారం వరకు సాలరీస్ రాకుండా సదరు రిటైర్డ్ సి ఆర్ డి అధికారి సుబ్బారావు అడ్డుకుంటున్నారని అన్నారు.
ఇదేమని ప్రశ్నిస్తే తన చేతులు తడపాలని లేనియెడల జీవితకాలం ఇదే విధంగా మిమ్మల్ని సతాయిస్తానని పరోక్షంగా యూనియన్ లకు సంకేతాలిస్తున్నారని అన్నారు.తన చేతులు తడపకపోతే సి ఆర్ డి అధికారులను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టిస్తానని, లేనిపోని అడ్డంకులు సృష్టించి మీకు దక్కే ఆర్థిక ప్రయోజనాలు అందకుండా చేస్తానని రెండున్నర దశాబ్దాలుగా పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలు సైతం దక్కకుండా చేస్తానని బాహటంగా హెచ్చరిస్తున్నాడని వారు వాపోయారు.
సెర్ఫ్ ఉద్యోగులను సాధించడంలో భాగంగా తాజాగా సెర్ప్ ఉద్యోగులకు వస్తున్న ఈపీఎఫ్ ను సగానికి సగం కోత విధించేలా సిఆర్డి నుంచి సెర్ప్ కు మేము జారీ చేయించాడని,ఎట్టి పరిస్థితుల్లో రెండవ వారం దాటే వరకు సాలరీస్ రానివ్వనన శపథం చేసి అమలు చేస్తున్నాడని అన్నారు. అలవెన్స్ లు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏవి కూడా సకాలంలో అందకుండా చూస్తానని హెచ్చరిస్తున్నాడని, ఆ మేరకు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తూ సి ఆర్ డి అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు.ఇలా నెల సాలరీ అలస్యం చేయడంతో పాటు అన్ని రకాల ప్రయోజనాలను వీలైనంత సమయం మేరకు అడ్డుకుంటున్నారని, సంబంధిత ఆర్డర్స్ అన్ని తీసుకెళ్లి అధికారులకు చూయించడంతో నెలలు నెలలు తిరిగి మళ్లీ పొందాల్సి వస్తుందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3974 సెర్ప్ ఉద్యోగులు విసిగి వేసారి పోయారని, 2008 లోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా 3005 మేమో , 650 జీవో ద్వారా ఈ ప్రయోజనాలన్నీ వర్తింప చేసిందని దశాబ్దాలుగా ఈ ప్రయోజనాలు పొందుతున్నామని, ఇప్పుడు ఈ అధికారి అడ్డుకోవడమేంటని సెర్ప్ స్టేట్ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ రిటైర్డ్ అధికారి చేష్టలకు విసిగివేసారి రేపు అన్ని జిల్లాల యూనియన్ నాయకులు, సభ్యులు 500 మంది సర్ప్ ఉద్యోగులు రేపు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు తెలియజేశారు. ముందుగా 500 మంది సెర్ప్ ఉద్యోగులు సెర్ప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీఈఓ కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని,అనంతరం సుమారు రెండున్నర దశాబ్దాలుగా హక్కుగా వస్తున్న ఈపీఎఫ్ సహా అన్ని రకాల అలవెన్స్లను అడ్డంకులు లేకుండా చెల్లించాలని, అదేవిధంగా ప్రతి నెల ఒకటవ తేదీనే సాలరీస్ ఇవ్వాలని సి ఆర్ డి కి సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి సెర్ఫ్ కు సాలరీస్ వచ్చేలా సెర్ప్ లోనే డిడిఓ ను నియమించాలని మరోసారి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. తదానంతరం సి ఆర్ డి కి వెళ్లి సి ఆర్ డి కమిషనర్ కు సంబంధిత రిటైర్డ్ కన్సల్టెంట్ పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.అప్పటికి అతని వైఖరిలో మార్పు రాకపోతే నేరుగా మంత్రి కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, అవసరమైతే ఈ ఉద్యోగిని తొలగించి అతనిపై కఠిన చర్యలు 0తీసుకునే వరకు నిరవధిక నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.. రేపటి పరిణామాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని యూనియన్ నాయకులు తెలిపారు.