Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 8:52 pm Posted by : ramakrishna

ఘోర రోడ్డు ప్రమాదం

  • ఒకరు మృతి.. మరొకరి పరిస్థతి విషమం

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిలాల జిల్లాలోని గంభీరావు పేట మండంలో  గల నాగంపేటకు చెందిన వినోద్ కుమార్(30), అతని స్నేహితుడు దేవేందర్ (30) పని నిమిత్తం నాగంపేట నుండి కామారెడ్డికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మార్గమధ్యలో ఉగ్రవాయి మైసమ్మ దగ్గరకు రాగానే వేగంగా వస్తున్న లారీ ద్వి చక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారని ఆసుపత్రికి తరలించారు. అయితే వినోద్ కుమార్ చికిత్ప పొందుతూ మృతి చెందాడు. దేవేందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.