Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 2:23 pm Posted by : ramakrishna

ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతి

 వెబ్ న్యూస్, బతుకమ్మ : అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఈఘటన చోటు చేసుకుంది. ఈప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ కలెక్టర్ పీలేరు యూనిట్-2  స్పెషల్ డిప్యూటీ  కలెక్టర్ రమ (50) మృతి చెందారు. మరో నలుగురు గాయపడటంతో రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతి చెందిన రమ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ కు కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతరపురం జిల్లా కల్యాణదుర్గం. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన రమ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి ప్రభుత్వ అండగా ఉండి మెరుగైన చికిత్స అందిస్తుందన్నారు.