సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం అభినందనీయం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను స్మరిస్తూ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్  ధన్యవాదాలు తెలిపారు. గురువారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, నరరూప రాక్షసులుగా చెలరేగిన రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4,000 మంది సిపిఐ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారన్నారు. దొరల గడీలలో వెట్టిచాకిరి విముక్తి కోసం బాంచన్ దొర అన్న ప్రజలతో బందూకులు...