Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 1:53 pm Posted by : ramakrishna

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

లగచర్ల, హకీంపేటలో రా ష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లగచర్ల, హకీంపేటలో రా ష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.  ఫార్మాకంపెనీల ఏర్పాటుకు అభ్యంతరం తెలుపుతూ, భూసేకరణకు వ్యతిరేకంగా  పలువురు హైకోర్టును ఆశ్రయించారు.  ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ కోసం ఆందోళనలు జరిగి పలువురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.