లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ కాల్చివేత
వెబ్ డెస్క్, బతుకమ్మ : భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్న ముష్కరులకు సొంత దేశం పాకిస్తాన్ లోనే నూకలు చెల్లుతున్నాయి. పాకిస్తాన్ లో ముష్కర ముఠా నేతల కాల్చివేతలు కొనసాగుతున్నాయి. సోమవారం లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ షేక్ యూసుఫ్ ఆప్రీది ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్తూలో షేక్ యూసుఫ్ అప్రీదిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఇప్పటి వరకు అతడిని ఎవరు చంపారు అని ఏ మిలిటేంట్ గ్రూప్ కూడా ప్రకటించలేదు....