Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:36 pm Posted by : ramakrishna

లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ కాల్చివేత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్న ముష్కరులకు సొంత దేశం పాకిస్తాన్ లోనే నూకలు చెల్లుతున్నాయి. పాకిస్తాన్ లో ముష్కర ముఠా నేతల కాల్చివేతలు కొనసాగుతున్నాయి. సోమవారం లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ షేక్ యూసుఫ్ ఆప్రీది ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్తూలో షేక్ యూసుఫ్ అప్రీదిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఇప్పటి వరకు అతడిని ఎవరు చంపారు అని ఏ మిలిటేంట్ గ్రూప్ కూడా ప్రకటించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే నాయకుల హత్యలు ఆ దేశంలో అలజడిని రేపుతున్నాయి. ఐఎస్ఐ కనుసన్నలలో పనిచేసిన వారిని రోజుకు ఒక్కరిని లేపేస్తుండటంతో ఉగ్రమూఠాల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ధురంధర్ సినిమా వచ్చిన తరువాత బిచ్చగాళ్లను వదలకుండా అనుమానిత ఏజేంట్లుగా పాకిస్తాన్ విచారణ సాగిస్తున్న సమయంలో వరుస హత్యలు ఆ దేశంలో ఏమి జరిగిన భారత్ హస్తం ఉందని అనుమానించడానికి సరిపోతుంది..