గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుని మృతి
డిచ్ పల్లి, బతుకమ్మ : మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు లక్కవత్రి నారాయణ (56) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 6:30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన నారాయణ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే తేరుకొని నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. 1996 సంవత్సరంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా చేరి ఆయన పది సంవత్సరాలు ఈనాడులో, 15 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్నారు. నారాయణ మృతి వార్త తెలుసుకున్న ...