Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 8:00 pm Posted by : ramakrishna

గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుని మృతి

డిచ్ పల్లి, బతుకమ్మ : మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు లక్కవత్రి నారాయణ (56) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 6:30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన నారాయణ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే తేరుకొని నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. 1996 సంవత్సరంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా చేరి ఆయన  పది సంవత్సరాలు ఈనాడులో, 15 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్నారు. నారాయణ మృతి వార్త తెలుసుకున్న  ఆర్టీసీ మాజీ చైర్మన్  బాజిరెడ్డి గోవర్ధన్. బిఆర్ఎస్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ లు మిట్టపల్లి గ్రామానికి చేరుకొని నారాయణ మృతదేహంపై పుష్పగుచ్చం వుంచి నివాళులర్పించారు. నారాయణ మృతి బాధాకరమని కుటుంబ సభ్యులకు ఓదార్చారు. మృతుడు నారాయణకు భార్య లక్ష్మి కుమారుడు సాయికిరణ్, కూతురు సౌజన్య ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు నారాయణ మృతి పట్ల రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి.  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. శాసనమండలి మాజీ సభ్యులు వి గంగాధర్ గౌడ్. అరికెల నర్సారెడ్డి. తిరుమల నర్సింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, జిల్లా జర్నలిస్టులు సంతాపాన్ని తెలిపారు. నారాయణ అంతక్రియలు శుక్రవారం మిట్టపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నారాయణ మృతి పట్ల డిచ్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపాన్ని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. 30 సంవత్సరాల పాటు డిచ్ పల్లిలో  పలు దినపత్రికల్లో పనిచేసి ప్రజల మన్ననలు పొందిన నారాయణ మృతి బాధాకరమని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎల్ గంగారం పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు లక్కవత్రి నారాయణ మృతి పట్ల డిచ్పల్లి మండల బిఆర్ఎస్ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ. దాసరి లక్ష్మీ నరసయ్య. నల్లవెల్లి సాయిలు. ఒడ్డం నరసయ్య. లింగం యాదవ్ తదితరులు సంతాపం తెలియజేశారు.

Senior journalist dies of heart attack