బిచ్కుంద కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జునప్ప హఠ్మారణం

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడూ శెట్కర్ మల్లికార్జున అప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుటాహుటిన  మల్లికార్జునప్ప ఇంటికి చేరుకున్నారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు , మరి కొంతమంది సీనియర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు.  మల్లికార్జున్ అప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరులేనివన్నారు. మల్లికార్జునప్ప మృతి వార్త తెలుసుకున్న పార్టీ నాయకులు అధిక సంఖ్యలో వచ్చి నివాళులర్పించారు....