- రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
వికారాబాద్, బతుకమ్మ : సొంత శాఖ సిబ్బంది నుంచి టీఏ బిల్లు రివార్డు ప్రాసెసింగ్ చేయడానికి లంచం తీసుకుంటూ ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు. వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న టి.శ్రీధర్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేసి హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.