సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు మృతి
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ప్రముఖ రాజకీయ నేత డి. సుదర్శన్ రావు(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.ఆయన గత పదిహేనేళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కుమారుడు విశ్వక్ సేన్ రాజ్ కూడా న్యాయవాదిగా, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా ఉన్నారు.తెలుగుదేశం పార్టీ పుట్టుకనుండి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం ముందు వరకు ఆ పార్టీ కీలకంగా పని చేశారు.నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత కేశ్ పల్లి గంగారెడ్డి అనుచరుడుగా ఉన్నారు....