కౌలాస్ కోట అభివృద్ధికి నివేదికలు పంపండి
జుక్కల్, బతుకమ్మ: చారిత్రక కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. కోటను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారని, సెలవు దినాల్లో పర్యాటల సంఖ్య రెట్టింపుగా ఉంటుందని, మూడు రాష్ట్రాల ( కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ) సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని...