డబ్బులు పంపండి.. దోషాలు పొగొడతాం..

శ్రీకాళహస్తిలో జోరుగా సాగుతున్న దందా శ్రీకాళహస్తి, బతుకమ్మ : ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయానికి రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల విశ్వాసాన్ని స్వార్థానికి వాడుకునేందుకు కొంతమంది మోసగాళ్లు తెగబడుతున్నారు. మీ జాతకంలో దోషాలున్నాయి... డబ్బులు పంపితే మేమే మీ పేరుతో పూజలు చేయిస్తాం అంటూ ప్రైవేటు వ్యక్తులు భక్తులను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలతో ఆలయాన్ని ఆశ్రయించే యువ భక్తులే వీరి లక్ష్యంగా మారుతున్నారు. జాతకంలో  దోషాలున్నాయని... నమ్మించి ఆలయంలో పనిచేసే...