అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
వెబ్ న్యూస్, బతుకమ్మ: అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. పంటలను పరిశీలించి ప్రాధమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను కూడా వెంటనే గోడౌన్ లకు తరలించాలని సూచించారు.