ఆరుతడి పంటలు సాగు చేయాలి
బాల్కొండ, బతుకమ్మ : ఎల్ నినో కారణంగా ప్రస్తుతం ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగును చేపట్టాలని బాల్కొండ మండల వ్యవసాయ అధికారి లావణ్య తెలిపారు. బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఎల్ నినో ప్రభావం మరియు ఆరుతడి పంటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ ఏడాది అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న...