ఫాస్ట్ ఫుడ్ సెంటలో నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలు

ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు   రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో  ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. రుద్రూర్ గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని...