Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 3:37 pm Posted by : ramakrishna

నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే జైలుకు పోవడం ఖాయం

 

. . .రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

రైతులకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు విక్రయించరాదని రాష్ట వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాందిగంజ్, గోదాం రోడ్, కిషన్ గంజ్ ప్రాంతంలో రాష్ట ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఆదేశానుసారం రాష్ట్ర  వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖ ల అధికారులు పర్టిలైజర్ , విత్తన విక్రయ కేంద్రాల లో శుక్రవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కి రైతే  ముఖ్యం రైతే రాజు కనుక రైతులు ఇబ్బందులు కలుగ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు సీడ్స్ షాప్స్ తనిఖీలు చేయడం జరిగిందని వారన్నారు

Selling spurious seeds and fertilizers will certainly lead to imprisonment

. రైతులకు విత్తనాలు గాని ఎరువులు గాని అమ్మితే కనుక వారి యొక్క పూర్తి వివరాలు తీసుకోవాల్సిందిగా వారికి రసీదులు ఇవ్వవలసిందిగా సీడ్స్ యజమానులకు సూచించారు. లేనియెడల వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విత్తనాలు గాని ఎరువుల గాని అమ్మితే గనక ఏదైనా పంటకు నష్టం జరిగితే చర్యలు తీసుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మితే గనక జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కావున అధికారులు సమయపాలన పాటించని ఎరువులు విత్తనాలు సంబంధించిన షాపుల్లో తనిఖీలు చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

Selling spurious seeds and fertilizers will certainly lead to imprisonment