Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2025, 10:44 am Posted by : ramakrishna

భీంగల్ ఎస్ఐ వేదిస్తున్నాడని యువకుడి సెల్పీ విడియో

. . . తనకు న్యాయం జరుగకపోతే అత్మహత్యనే శరణ్యమని విడియో

 భీంగల్, బతుకమ్మ:

భీంగల్ పోలీసుల వ్యవహర శైలీ వివాదాస్పధంగా మారుతోంది. ఇప్పటికే  తీవ్ర అవినీతి ఆరోపణలతో నిజామాబాద్ జిల్లాలో భీంగల్ పోలీసుల వ్యవహరం పోలీస్ శాఖ పరువును రచ్చకిడ్చింది. నిజామాబాద్ కు రెగ్యూలర్ పోలీస్ కమీషనర్ లేకపోవడంను అలుసుగా తీసుకుని వేదింపులకు పాల్పడుతున్నారు కమీషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు. ఇప్పటికే పోలీస్ ఠాణాలు సివీల్ సెటిల్మేంట్ లకు అడ్డాగా మారాయాని ఆరోపణలు వస్తుండగా భీంగల్ పోలీస్ అధికారుల వేదింపులపై ఓక యువకుడు సోషల్ మీడియాలో విడుధల చేసిన పోస్టు రచ్చగా మారింది. భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగల్  గ్రామానికి చెందిన నిఖేష్ అనే యువకుడి సెల్పీ విడియో సోషల్ మీడియాలో గిరికిలు కొడుతుంది. తన పై కాంగ్రెస్ నేత ప్రోద్బలంతో తన భార్య వరకట్న వేదింపుల పై పిర్యాదు చేయడంతో భీంగల్ పోలీసులు నమోదు చేసి వేదిస్తున్నారని తనకు ఆత్మహత్యనే శరణ్యమంటు సారంశం కలిగిన 2 నిమిషాల 29 విడియో ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్ లలో రచ్చగా మారింది. తన కోసం పోలీసులను ఇంటికి పంపించి వేదించడంతో పాటు ట్రాక్టర్ తీసుకువచ్చి అప్పగించకపోతే జైలుకు పంపుతామని ఎస్ఐ బేదిరిస్తున్నాడని  నిఖేష్ వాపోయాడు. తనకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని పోలీసుల వేదింపుల కారణంగా తనపై ఆదారపడిన కుటుంబాన్ని విడి ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నానని భాదితుడు విడియోలో పేర్కోన్నారు.