Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 8:12 pm Posted by : ramakrishna

సెల్ఫ్ మోటివేషన్ కావాలి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం సుంకెట్ ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమంలో భాగంగా సహన మాట్లాడుతూ  తనకు తానుగా మోటివేషన్ చేసుకోవాలని అలాగే మైండ్ మ్యాపింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండి మిర్రర్ వర్క్ చేయాలని అన్నారు. సిగరెట్ డబ్బా దానిలోని చెడును గర్వంగా చెబుతుంది. అలాంటిది మనలో ఉన్న లక్షణాలు మనం చెప్పుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. డబ్బు సంపాదించాలి దానితో పాటు సేవ చేయడం కూడా తప్పనిసరి అని చెప్పినారు. అనంతరం ఆమెను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Self motivation is required