పాలెం పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
బతుకమ్మ,మోర్తాడ్; మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా స్వయం పాలన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు టీచర్లుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు, దిగువ స్థాయి విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. అనంతరం టీచర్స్ డే సందర్భంగా జహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, జయశ్రీ, త్రివేణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.