రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పెరుగుతున్న ప్రమాదాలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...