విజయానికి పునాది ఆత్మవిశ్వాసం

  ఏర్గట్ల, బతుకమ్మ :   జీవితంలో ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసం ఉండాలని, అది ఉన్ననాడు ఏ రంగంలోనైనా ఉన్నత విజయాలు సాధిస్తారని, ముఖ్యంగా విద్యార్థులు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ఏర్గట్ల మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి తెలుగు, హిందీ ప్రతిభ పరీక్షకు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. ఇలాంటి పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుందని...