రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్ధుల ఎంపిక
నిజామాబాాద్, బతుకమ్మ : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె. సత్యనాథ్ రెడ్డి తెలిపారు.ఈ నెల 14 వ తేదిన వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు మనోజ్ ,ప్రమోద్ ఇద్దరు విధ్యార్ధులు పాల్గొంటున్నారని తెలిపారు.ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.