రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఏర్గట్ల విద్యార్థి ఎంపిక
బతుకమ్మ,ఏర్గట్ల: 71వ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డి ఛాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్గట్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నిఖిత ఎంపికైంది.ఈనెల ఏడు నుండి పదవ తారీకు వరకు హైదరాబాదులో జరిగే పోటీలకు సారథ్యం వహిస్తుందని,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి తెలిపారు. రాష్ట్రస్థాయిలో కబడ్డీ పోటీలో ఎంపికైన నిఖితను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి అభినందించారు. రాష్ట్రస్థాయిలో పాఠశాల పేరును నిలిపినందుకు, అలాగే క్రీడారంగంలో పాఠశాల కు గుర్తింపు తెచ్చినందుకు విద్యార్థిని ని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నిఖితను పాఠశాల...