Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 1:04 pm Posted by : ramakrishna

కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

వెబ్ న్యూస్,బతుకమ్మ  : తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్  మీటింగ్ లో పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒకటి, మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేయనున్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు ఒక్కొక్కటి.. బీసీ లేదా ఓసీ కి సీటు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీ కోటాలో  అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ (నల్గొండ  డీసీసీ), నెహ్రూ నాయక్ (మహబూబాబాద్), ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీభవన్ ఇన్ చార్జి కుమార్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈమేరకు కొద్దిసేపట్లో  అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ నివేదిక ఇవ్వనున్నారు. కాగా, అధిష్టానం గత ఎన్నికల్లో పోటీ చేసినవారికి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నవారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వట్లేదని తెలుస్తోంది.