Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 6:02 pm Posted by : ramakrishna

రాష్ట్రస్థాయి అర్చరి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక

బతుకమ్మ భిక్కనూరు: రాష్ట్రస్థాయి అర్చరి పోటీలకు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి అనుదీప్ ఎంపికైనట్లు నోడల్ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 23, 24 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన అర్చరి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని, నవంబర్ ఒకటవ తేదీ నుండి వరంగల్ జిల్లా తొర్రూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అనుదీప్ ప్రాతినిథ్యం వహిస్తాడని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థి అనుదీప్ ను నోడల్ అధికారి శ్రీనాథ్, పాఠశాల పిడి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.