Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 2:24 pm Posted by : ramakrishna

జాతీయస్థాయి  ఫుట్ బాల్ టోర్నీకి ఎంపిక

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ప్రజ్ఞ జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నీకి ఎంపికైంది. ఇటీవల మెదక్ లో నిర్వహించిన రాష్ర్టస్థాయి ఫుట్ బాల్ టోర్నీలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ప్రజ్ఞ జాతీయస్థాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ ప్రసన్నకుమారి తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న టోర్నీలో ప్రజ్ఞ పాల్గొననుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పాఠశాల యాజమాన్యంతోపాటు క్రీడాకారిణి ప్రజ్ఞ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజ్ఞను, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.