నందిపేట్, బతుకమ్మ : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు మండలకేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగాసాగర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని 9 వ తరగతి విద్యార్థులు రెంజర్ల శ్రీవల్లి, షేక్ సోఫియాన్, లు ఎస్జీ ఎఫ్ యూ 17 జూడో పోటీలకు ఎంపిక య్యారని, ఆదివారం వరంగల్ జిల్లాలో జరిగే ఈపోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ లోని జూడో హాల్లో జరిగిన ఎంపికలో పాల్గొని ప్రథమ స్థానం పొంది వీరు రాష్ట్రస్థాయికి ఎంపిక య్యారని వెల్లడించారు. శనివారం ఈవిద్యార్థులను కరస్పాండెంట్ కానూరి గంగాసాగర్, హెచ్ఎం గంగా భూషణ్, డైరెక్టర్ శోభ, పీఈటీ లు ముత్యం, సుమలత, లిఖిత, సందీప్, లు అభినందించారు.