Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2025, 11:01 am Posted by : ramakrishna

అర్ధరాత్రి మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

 

 కోటగిరి, బతుకమ్మ :

మంజీర పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్ లను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి పోతంగల్ రెండవ బ్రిడ్జి వద్ద మూడు ట్రాక్టర్ లలో ఇసుకను తరలిస్తుండగా కోటగిరి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ హెచ్ ఓ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్ లను సీజ్ చేసి కోటగిరి పోలీస్ స్టేషన్ తరలించారు.