- ముగ్గురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్
పరారీలో సూత్రదారి
బతుకమ్మ,నిజామాబాద్ క్రైం : ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిషేదిత అల్ప్రాజోలం రవాణాను అడ్డుకునేందుకు శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలంలో ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగింది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐలు స్వప్న, వెంకటేష్, షాకిర్ హైమద్ లతో పాటు ఎస్సైలు, సిబ్బంది నాగిరెడ్డిపేట మండలం లింగంపేట్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. మాసాని పల్లికి చెందిన బండారి సిద్దిరామాగౌడ్ ను అదుపులోకి తీసుకుని అతని ద్వారా గాంధారి మండల కేంద్రంకు చెందిన ప్రవీణ్ గౌడ్, రుద్రారం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ లను అదుపులోకి తీసుకున్నారు. మాసాని పల్లికి చెందిన బండారు బాబాగౌడ్ పరారీ అయ్యాడు. ముగ్గురి వద్ద నుంచి 3.340 గ్రాముల నిషేదిత అల్ప్రాజోలంను పట్టుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.33 లక్షలని తెలిపారు. పరారీలో ఉన్న బండారి బాబాగౌడ్ కోసం గాలిస్తున్నారు. నిందితుల వద్ద ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎ క్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.