ఇసుక వాహనం పట్టివేత

బతుకమ్మ,పోతంగల్ : మండల కేంద్రంలోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా మోటార్స్ వాహనాన్ని శుక్రవారం ఉదయం కోటగిరి గ్రామ శివారు వద్ద  పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ రఫీక్ అతని యజమాని షైక్ లతీఫ్  లపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.