Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2024, 6:25 pm Posted by : ramakrishna

 అడవి పందులను తరలిస్తున్న వాహనం పట్టివేత

. . .  వాహనం వదిలి పరారైన వేటగాళ్లు

. . .  నాలుగు అడవి పందుల స్వాధినం

. . . వాహనం సీజ్ చేసిన పారెస్ట్ అధికారులు

 బతుకమ్మ, నందిపేట్

నిజామాబాద్ జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వన్యప్రాణుల వేట యుదేచ్చగా సాగుతుంది. నందిపేట్ మండలం షాపుర్ వద్ధ ఆటవి ఆదికారులు విశ్వ సనీయ సమాచారం మేరకు బోలేరో వాహనంను పట్టుకున్నారు. శనివారం రాత్రి ఆటవి రెంజ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటి రెంజ్ అధికారి సుధాకర్ అధ్వర్యంలో షాపుర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా  బోలేరో వాహనంలో వన్యప్రాణుల వేటకు సంబందించిన సామాగ్రీ గుర్తించారు. అ విషయంలో అందులో ఉన్న డైవర్, ముగ్గురు వ్యక్తులను విచారించేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. అవాహనంలో వేటాడి తరలిస్తున్న నాలుగు అడవి పందులను గుర్తించారు. అంతే గాకుండా వేటకు సంబందించిన వలలు, జిఐ వైర్లు గుర్తించారు. రాత్రి వేళ గోదావరి తీరంలో కరేంటు షాక్ లు ఇచ్చి  లేదా వలలు పెట్టి వణ్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలిపారు. వణ్య ప్రాణుల సంరక్షణకు ఆటవి శాఖ కఠిన చట్టలు అమలు చేస్తుందని వాటిని వెటాడిన, వాటిని చంపి వండిన క ఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరారీలో ఉన్న వేటగాళ్లను పట్టుకుంటామని  తెలిపారు.

 

Seizure of a vehicle transporting wild boars