భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బెజ్జోరా గ్రామంలో వాగు నుండి అక్రమంగా ఇసుకను గ్రామంలోకి తరలించి నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన విషయం విధితమే కాగా అట్టి ఇసుకను గురువారం వేలం వేశారు. తహసీల్దార్ మొహ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇసుక వేలం పాటలో ఆసక్తి గల ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ వేలం సర్కార్ వారి పాట రూ. 22 వేలతో ప్రారంభం కాగా పాట చివరలో బాబాపూర్ కు చెందిన మొహ్మద్ సమీర్ రూ. 51 వేలకు దక్కించుకొన్నారు. వేలం అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ వేలం డబ్బులు ట్రెజరర్ కు చెల్లించిన అనంతరం వేలం దక్కించుకొన్న వారు ఇసుకను తరలించుకోవాలని సూచించారు. ఈ వేలం కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్. ఐ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.