Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 8:07 pm Posted by : ramakrishna

సీజ్ చేసిన ఇసుక వేలం పాట

బతుకమ్మ,మోర్తాడ్: అనుమతులు లేకుండా ఇసుక నడిపిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో డంపు చేసినట్లు తెలుసుకున్న తాసిల్దార్ గత శనివారం 64 ఇసుక కుప్పలను సీజ్  చేసిన విషయం తెలిసిందే. సీజ్ చేసిన (64) ఇసుక అక్రమ కుప్పలకు తహసీల్దార్ సత్యనారాయణ సోమవారం మోర్తాడ్ మండలం కార్యాలయంలో , తహసీల్దార్ సమక్షంలో వేలం పాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలం పాట లో మోర్తాడ్ గ్రామానికి చెందిన తక్కూరి సతీష్ అనే వ్యక్తి రూ.1,80,000/- కి వేలం పాటలో అత్యధిక ధర పలకడం జరిగిందని తెలిపారు. ఇట్టి  రూపాయలను ప్రభుత్వ ఖజానాలో జామచేయడం జరుగుతుందనీ తాసిల్దార్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఇట్టి ఇసుకను వేలం పాటలో అత్యధిక ధర పలికిన వ్యక్తి కి అప్పజెప్పడం జరుగుతుందని తెలియజేశారు.