మూడోసారి సీతయ్యకే డీసీఈబీ పగ్గాలు
భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి పరీక్షల విభాగం (డీసీఈబీ) కార్యదర్శిగా మూడోసారి సీతయ్య పగ్గాలు చేపట్టారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో గల డీసీఈబీ కార్యాలయంలో ఉమ్మడి పరీక్షల విభాగం సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ కుమార్ డీసీఈబీ కార్యదర్శిగా సీతయ్యను నియమిస్తూ నిర్ణయం తీసకున్నారు. ఈ నిర్ణయం సమావేశానికి హాజరైన సభ్యుల అభిప్రాయాలు తీసుకోకముందే డీఈఓ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సభ్యులకు తమ అభిప్రాయాలు...