బతుకమ్మ, వేల్పూర్ :
వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో గురువారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సర్వే లో పాల్గొని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులకు సహకరించాలని, ఎక్కడైనా ఇబ్బందులు కలిగిన చోట వెళ్లి సర్వేకు వచ్చిన వారికి సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు చెప్పింది రాసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం మల్లేష్, టక్కరి గంగాధర్, గంగారెడ్డి పాల్గోన్నారు.