నిజామాబాద్ అభివృద్ధికి లౌకిక శక్తులే మార్గం
. . . కార్పొరేషన్ ఎన్నికల్లో లౌకికవాదులకే ఆర్ ఎస్ పి మద్దతు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్పష్టమైన లౌకిక వైఖరితో ముందుకు సాగుతుందని రాష్ట్ర కమిటీ సభ్యులు బోడ అనిల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు, నాయకులు తమ పదవీకాలాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ముగించారని, ఫలితంగా నిజామాబాద్ నగరం సమస్యల కుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలో మంచినీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ...