పసుపు బోర్డు రహస్య సమావేశం..?
కొనుగోలు దారుల, విక్రేతలతో గుట్టుగా సమావేశం మీడియాకు నో ఎంట్రీ నిజామాబాద్, బతుకమ్మ: పసుపు అత్యధికంగా పండించే రైతులు పసుపు బోర్డు ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని భావించగా అవి అడియాసలు అయ్యాయి. ఇప్పటి వరకు బోర్డు అధికారులు దానిపై ఇంత వరకు ఒక్క ప్రకటన చేయలేదు. ఇంత వరకు పసుపు రైతులను కలిసి వారికి పసుపు మద్దతు ధరపై కనీసం భరోసా ఇవ్వలేదు. తాజాగా పసుపు కొనుగోలు చేసే వ్యాపారులు క్వింటాళుకు రూ.500 తగ్గిస్తే ఇప్పటి వరకు పసుపు బోర్డు స్పందించలేదు. ...